22న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ పఠనం నిర్వహిస్తారు.

Updated : 20 Mar 2023 05:37 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ పఠనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు నిర్వహిస్తారు. ఆ రోజు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని తితిదే రద్దు చేసింది. 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.

* శ్రీవారి సర్వదర్శనానికి ఆదివారం దాదాపు 24 గంటలు పట్టింది.  స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు