కోటి రుద్రాక్షల మహాయజ్ఞం

కోటి రుద్రాక్షలు సేకరించి వాటిని మాలలుగా కట్టి ధారణ చేయడమంటే అది ఒక మహాయజ్ఞమే. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా కోటి రుద్రాక్షలతో పూజ చేయనున్నారు.

Published : 20 Mar 2023 03:49 IST

కోటి రుద్రాక్షలు సేకరించి వాటిని మాలలుగా కట్టి ధారణ చేయడమంటే అది ఒక మహాయజ్ఞమే. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా కోటి రుద్రాక్షలతో పూజ చేయనున్నారు. నేపాల్‌లోని కొండ ప్రాంతాల్లో లభించిన రుద్రాక్షలను 6నెలల పాటు సేకరించి నాలుగు భారీ ట్రక్కుల్లో విజయవాడ తరలించారు. తీసుకొచ్చిన 1 కోటి 20లక్షల రుద్రాక్షలను కడిగి ఆరబెట్టి, పాడైనవి తీసేసి కోటి రుద్రాక్షలను సిద్ధం చేస్తున్నారు. వాటికి రంధ్రాలు చేసి 108 రుద్రాక్షలను రాగి తీగతో ఒక మాలగా కడుతున్నారు. దాదాపు 6 నెలలుగా 70మంది మహిళలతో కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసి 94 వేల మాలలు సిద్ధం చేస్తున్నారు. వీటిని ఈనెల 28న శిర్డీ సాయిబాబాకు ధారణ చేస్తారు. దాదాపు రూ.2 కోట్ల విరాళాలతో విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా ఆలయంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ గౌరవాధ్యక్షులు గౌతంరెడ్డి తెలిపారు.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు