మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలి

రాష్ట్రానికి చెందిన ఎస్సీ వసతి గృహ విద్యార్థులు వారి విజ్ఞాన యాత్రలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీని కలిశారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.

Published : 20 Mar 2023 04:38 IST

ఎస్సీ వసతి గృహ విద్యార్థులతో ప్రధాని మోదీ
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఎస్సీ వసతి గృహ విద్యార్థులు వారి విజ్ఞాన యాత్రలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీని కలిశారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ప్రధాని వారితో ముచ్చటించి పుస్తకాలను బహూకరించారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇండియన్‌ బ్యాంకు సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ విద్యార్థులతో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు విజ్ఞాన యాత్ర చేపట్టింది. వైయస్‌ఆర్‌, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 42 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా దిల్లీ చేరుకున్న విద్యార్థులు పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని కలిశారు. స్వాతంత్య్ర సమర యోధులు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలను చదివి స్ఫూర్తి పొందాలని మోదీ విద్యార్థులకు ఉద్బోధించారు. పరీక్షలంటే భయాన్ని వదిలేయాలని సూచించారు. నీతి నిజాయతీలతో సంపాదించాలని, అలా వచ్చిన ధనాన్ని వృథా చేయకుండా పొదుపు చేసుకోవాలని సూచించారు’ అని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని