జనంలోకి ‘జి-20 సన్నాహక సదస్సుల’ లక్ష్యాలు

జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో జన భాగస్వామ్య కార్యక్రమాలకు విశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Updated : 21 Mar 2023 05:40 IST

విశాఖలో నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు 

ఈనాడు, విశాఖపట్నం: జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో జన భాగస్వామ్య కార్యక్రమాలకు విశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగే సదస్సులకు 45 దేశాలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ సదస్సుల లక్ష్యాలు ప్రజల్లోకి వెళ్లేందుకు మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటలకు ‘యోగా ఆల్‌’ పేరుతో వుడా, జీవీఎంసీ, సెంట్రల్‌ పార్కులలో యోగా తరగతులు నిర్వహించనున్నారు. 22న విద్యార్థులతో ‘మాక్‌-జీ20 కాన్‌క్లేవ్‌’ పేరుతో సదస్సు, 24న‘ సాగరతీర స్వచ్ఛత’ పేరుతో బీచ్‌ క్లీనింగ్‌, 25న చిత్రలేఖనం (ఆర్ట్‌ కాంటెస్ట్‌) పోటీలు, 26న వైజాగ్‌ సిటీ మారథాన్‌, వైజాగ్‌ కార్నివాల్‌ పేరుతో కూచిపూడి, వీరనాట్యం, థింసా, కోలాటం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరో వైపు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పర్యాటకశాఖ సంయుక్తంగా సుమారు రూ.150 కోట్లతో నగరంలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు’ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ముడసర్లోవలోని సోలార్‌ ప్రాజెక్టు, కాపులుప్పాడలోని జిందాల్‌ రీసైక్లింగ్‌ ప్లాంటు, తాగునీటి ప్రాజెక్టు, కమాండ్‌ కంట్రోల్‌ ఆపరేషన్స్‌, కైలాసగిరి, ఆర్కే బీచ్‌ వంటి ప్రదేశాలను సందర్శించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని