నేటి నుంచి వర్క్‌ టూ రూల్‌: బొప్పరాజు

ఉద్యోగుల డిమాండ్లపై గత నెల ఇచ్చిన వినతిపత్రంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Updated : 21 Mar 2023 05:47 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగుల డిమాండ్లపై గత నెల ఇచ్చిన వినతిపత్రంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. మంగళవారం నుంచి వర్క్‌ టూ రూల్‌ పాటించనున్నామని, ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే ఉద్యోగులు సమయపాలన పాటించాలని పిలుపునిచ్చారు. ఐకాస ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో కొనసాగుతున్న ఉద్యోగుల నిరసన ప్రదర్శనలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 96 సంఘాలు ఉద్యమంలో పాల్గొన్నాయన్నారు. ఉద్యోగుల బకాయిలు ఇచ్చామంటున్నారని.. రెండేళ్లుగా దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఈహెచ్‌ఎస్‌ డబ్బులు మాత్రమే ఇచ్చారని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని