పంట రుణ పరిమితి పెంపు

వచ్చే ఖరీఫ్‌లో వరి సాగుకు పంట రుణ పరిమితిగా రూ.42వేలు, రబీలో రూ.45వేలు చొప్పున గరిష్ఠంగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం తీర్మానించింది.

Updated : 21 Mar 2023 05:58 IST

ఎకరా వరికి ఖరీఫ్‌లో గరిష్ఠంగా రూ.42 వేలు.. రబీలో రూ.45వేలు

ఈనాడు-అమరావతి: వచ్చే ఖరీఫ్‌లో వరి సాగుకు పంట రుణ పరిమితిగా రూ.42వేలు, రబీలో రూ.45వేలు చొప్పున గరిష్ఠంగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం తీర్మానించింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధ్యక్షతన సోమవారం మంగళగిరిలో నిర్వహించిన ఈ సమావేశానికి వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌, సహకారశాఖ కమిషనర్‌ బాబు, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్‌ శ్రీధర్‌, బ్యాంకర్ల కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వాతావరణ పరిస్థితులు, జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు తయారు చేసిన పంట రుణ పరిమితులను పరిగణనలోకి తీసుకుని 2023-24 సంవత్సరానికి సగటున 15% నుంచి 20% మేర పెంచాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ద్వివేది ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని