వివిధ పద్దులకు శాసనసభ ఆమోదం

వివిధ శాఖలకు చెందిన పద్దులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, కార్మిక, దేవాదాయ ధర్మాదాయ, ఇంధన, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత, పర్యాటక శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పద్దులకు సభ ఆమోద ముద్ర వేసింది.

Updated : 21 Mar 2023 06:23 IST

ఈనాడు-అమరావతి: వివిధ శాఖలకు చెందిన పద్దులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, కార్మిక, దేవాదాయ ధర్మాదాయ, ఇంధన, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత, పర్యాటక శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పద్దులకు సభ ఆమోద ముద్ర వేసింది. ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, జయరాం, గుడివాడ అమర్‌నాథ్‌, రోజా వీటిని ప్రవేశపెట్టగా.. చర్చల అనంతరం వీటికి సభ ఆమోదం తెలిపింది.

* 2022-23 సంవత్సర సవివర రెండో విడత వ్యయపు అనుబంధ అంచనాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తరపున మంత్రి ధర్మాన ప్రసాదరావు సమర్పించారు.

లఘు చర్చ మార్పు

* ‘ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, పెట్టుబడులు, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి’ అనే అంశంపై లఘు చర్చ అని తొలుత స్పీకర్‌ ప్రకటించారు. ఇంతలోనే చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు స్పీకర్‌ దగ్గరకు వచ్చి చెప్పడంతో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, కుంభకోణంపై చర్చ అని ప్రకటించారు.

* పంచాయతీరాజ్‌శాఖ పద్దుపై చర్చ అనంతరం ఆ శాఖ మంత్రి మాట్లాడాలని స్పీకర్‌ సీతారాం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సూచించారు. ఆయన లేచి నిలబడి ఇప్పుడు ఆ శాఖ తనది కాదు అన్నట్లు చూడటంతో.. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు లేచారు. దీంతో మీరు (పెద్దిరెడ్డితో) ఇంకా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అనే భావనలోనే ఉన్నానని స్పీకర్‌ సీతారాం అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని