భిన్న సంస్కృతుల సంగమం మన దేశం

విభిన్న వర్ణాలు, మతాలు, సంస్కృతులతో ఏర్పడిన హరివిల్లు మన దేశమని ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ అన్నారు. దిల్లీ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ఇండియన్‌ మైనారిటీస్‌ ఫౌండేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 22 Mar 2023 05:09 IST

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ఈనాడు, దిల్లీ: విభిన్న వర్ణాలు, మతాలు, సంస్కృతులతో ఏర్పడిన హరివిల్లు మన దేశమని ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ అన్నారు. దిల్లీ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ఇండియన్‌ మైనారిటీస్‌ ఫౌండేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగిస్తూ దేశ ఐక్యత, సమగ్రతకు రాజ్యాంగమే రక్షణ కవచమని.. రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణ, అమలులో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరాలు తీర్చడం మొదలు ‘సబ్‌కాసాత్‌- సబ్‌కా వికాస్‌- సబ్‌కా విశ్వాస్‌- సబ్‌కా ప్రయాస్‌’ అనే సమతా నినాదంతో యావద్భారత సమగ్ర, సంపూర్ణాభివృద్ధికి ప్రధాని పాటుపడుతున్నారని కొనియాడారు. అల్పసంఖ్యాకులు వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాలను అధిరోహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ మైనారిటీ గ్రూపులకు చెందిన ప్రొఫెసర్లు, ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు