కొమ్మ నరికినా.. కాయలిస్తా..

చెట్ల కొమ్మలు తొలగించినా.. మొదలు భాగంలో గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాసి ఆశ్చర్యపరుస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామంలో సురేశ్‌ అనే రైతు.

Published : 22 Mar 2023 05:09 IST

న్యూస్‌టుడే, తాడిమర్రి: చెట్ల కొమ్మలు తొలగించినా.. మొదలు భాగంలో గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాసి ఆశ్చర్యపరుస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామంలో సురేశ్‌ అనే రైతు పది ఎకరాల మామిడి తోటలో చెట్లు బాగా పెరగాలని గత ఏడాది కొమ్మలను నరికివేయించారు. చెట్లు ఏపుగా పెరగడంతో పాటు పరిమాణం బాగుంటుందని ఇలా చేశారు. కొమ్మలను తొలగించిన మొదలులో 50 నుంచి 60 వరకు కాయలు కాశాయి. గాలివాన వచ్చినా కాయలు దెబ్బతినకుండా అలానే ఉన్నాయి. ఇలా కాయలు కాయడం చాలా అరుదని స్థానిక ఉద్యాన అధికారి పోతులయ్య పేర్కొన్నారు.        

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని