5 లక్షణాలుంటేనే ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గతంలో 5 లక్షణాల ఆధారంగానే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పడం ద్వారా.. ఆ అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని గుర్తుచేసింది.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్
ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసిన మంత్రి
లోక్‌సభలో రాష్ట్ర ఎంపీల ప్రశ్నలకు జవాబు
ఈనాడు - దిల్లీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గతంలో 5 లక్షణాల ఆధారంగానే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పడం ద్వారా.. ఆ అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని గుర్తుచేసింది. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వాగ్దానం చేశారా.. లేదా అన్న ప్రశ్నను దాటవేసింది. లోక్‌సభలో వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి మంగళవారం అడిగిన ప్రశ్నలకు కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అయిదు లక్షణాలను నిర్దేశించిందని, వాటి ఆధారంగానే గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కట్టబెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
‘‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అనుసరించే విధానమేంటి? ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వకపోవడానికి కారణమేంటి? 2014లో విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం వాగ్దానం చేసిందా? ఒకవేళ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిచేసిన వాగ్దానాలేంటి? విభజన చట్టంలో ఇంకా ఏయే వాగ్దానాలు పెండింగ్‌లో ఉన్నాయి, వాటి జాప్యానికి కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులకు 90:10 నిష్పత్తిలో నిధులు సమకూర్చడానికి కేంద్రం అంగీకరించిందా? అంగీకరిస్తే ఇప్పటివరకు ఏం చేసింది? ప్రత్యేక హోదా కోసం గత ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమైనా విజ్ఞాపన వచ్చిందా? వస్తే అందులో వివరాలేంటి? రాష్ట్రానికి ఎప్పటిలోపు ప్రత్యేక హోదా ఇస్తారు?’’ అని వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు కొన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు అందాయి. ప్రణాళికా సాయం కోసం గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించింది. 1. కొండ, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు 2. తక్కువ జనసాంద్రత/ అధికసంఖ్యలో గిరిజన జనాభా, 3. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, 4. ఆర్థిక, మౌలిక వసతుల పరంగా వెనుకబాటుతనం, 5. రాష్ట్రానికి ఆర్థిక సుస్థిరత లేకపోవడం లాంటి లక్షణాలన్నీ ఉంటేనే గతంలో ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించారు.
తేడా చూపొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పింది
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పంచేటప్పుడు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి తేడా చూపలేదు. ఆ సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పంచే పన్ను వాటాను 32% నుంచి 42%కి పెంచింది. 15వ ఆర్థిక సంఘం దాన్ని యథాతథంగా ఉంచింది. రాష్ట్రాల వనరుల లోటును సాధ్యమైనంత మేరకు పన్ను పంపిణీ ద్వారా భర్తీచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇలా పన్నుల్లో వాటా పంచిన తర్వాత కూడా లోటు ఉన్న రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ గ్రాంట్లు ఇచ్చాం.
ప్రత్యేక సాయానికి అంగీకరించాం
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 90:10 నిష్పత్తిలో ఇచ్చి ఉంటే 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎంత అదనపు మొత్తం వచ్చి ఉండేదో దాన్ని భర్తీచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక సాయం చేయడానికి అంగీకరించింది. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్రప్రభుత్వం సంతకం చేసి తీసుకున్న రుణాల వడ్డీ, అసలును చెల్లించడానికి కేంద్రం సిద్ధపడింది. దాని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు 2018-19లో కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాల తిరిగి చెల్లింపు కోసం రూ.15.81 కోట్లు విడుదల చేసింది.
విభజన చట్టంలో చాలా అమలు చేశాం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశాం. మిగిలిన వాటి అమలు వివిధ దశల్లో ఉంది. మౌలికవసతులు, విద్యాసంస్థల్లాంటి వాటికి దీర్ఘకాలం అవసరం. విభజన చట్టంలోనే వాటికి పదేళ్ల సమయం ఇచ్చారు’’ అని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
-
Politics News
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి