శాస్త్రోక్తంగా కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.

Updated : 22 Mar 2023 06:27 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు శుద్ధి చేసి పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. బుధవారం ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఉదయం ఏడింటినుంచి 9గంటల మధ్య ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం పంచాగశ్రవణం ఉంటుంది.


తితిదే అన్న ప్రసాదానికి నారా దేవాన్ష్‌ రూ.33 లక్షల విరాళం

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మనవడు, లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా రూ.33 లక్షలను తితిదే అన్నప్రసాదట్రస్టుకు మంగళవారం అందజేశారు. సదరు విరాళాన్ని దాత చంద్రబాబు విజ్ఞప్తి మేరకు దేవాన్ష్‌ పేరుతో మంగళవారం ఒక రోజు పూర్తిగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానాలకు తితిదే వెచ్చించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని