ఉగాది ఉజ్వల భవిష్యత్తును తేవాలి

ఈ తెలుగు నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉల్లాసాన్నీ, ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు.

Published : 22 Mar 2023 05:08 IST

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్ష

ఈనాడు, అమరావతి: ఈ తెలుగు నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉల్లాసాన్నీ, ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. శోభకృత్‌ నామ ఉగాదిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రగతి శోభ రావాలి

 చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతోపాటు దేశ విదేశాల్లోని తెలుగు వారికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలి. చీకట్లు తొలగిపోయి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నవోదయం రావాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి

పవన్‌

‘శోభకృత్‌ నామ సంవత్సరం ప్రవేశిస్తున్న ఈ శుభ ఘడియల్లో తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరి జీవితాలు శోభాయమానం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని