పూర్తిగా మారనున్న 9వ తరగతి సిలబస్
రాష్ట్రంలోని పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కొన్ని తరగతుల వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మారనుంది. ఏలూరు వచ్చిన ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంచాలకుడు కె.రవీంద్రనాథ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు.
ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కొన్ని తరగతుల వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మారనుంది. ఏలూరు వచ్చిన ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంచాలకుడు కె.రవీంద్రనాథ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. ‘9వ తరగతి సిలబస్ పూర్తిగా మారనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఉపవాచకాలు ఉంటాయి. ఆంగ్లం సబ్జెక్టుకు వర్క్‌బుక్ ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో నాలుగు, గణితంలో రెండు పుస్తకాలుంటాయి. కొత్తగా ముద్రితమయ్యే పుస్తకాల్లో ఒకవైపు పేజీలో ఆంగ్ల మాధ్యమం, రెండో వైపు తెలుగు లేదా ఉర్దూ మాధ్యమాలు ఉంటాయి’ అని తెలిపారు.
5వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు: 1 నుంచి 5 తరగతులకు ప్రస్తుతం అమల్లో ఉన్న మూడు సెమిస్టర్ల స్థానంలో రెండు సెమిస్టర్ల విధానం అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. 6, 7 తరగతుల ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టులు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ మేరకు ఉంటాయన్నారు. 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మార్పు ఉండదని, 10వ తరగతి సిలబస్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి మారుతుందని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!