అంకురాల ప్రోత్సాహం.. ఉపాధికి ఉత్సాహం

వచ్చేనెల నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త పారిశ్రామిక విధానం నిర్ణయాలు, లక్ష్యాలు, ప్రత్యేకతలివీ...

Published : 22 Mar 2023 05:39 IST

కొత్త పారిశ్రామిక విధానం ప్రత్యేకతలివీ...

ఈనాడు, అమరావతి: వచ్చేనెల నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త పారిశ్రామిక విధానం నిర్ణయాలు, లక్ష్యాలు, ప్రత్యేకతలివీ...

లక్ష్యాలు...

జీఎస్‌డీపీలో పారిశ్రామిక రంగం వాటా 30 శాతం

రాష్ట్రానికి ఉన్న సహజ తీర ప్రాంతం ఆధారంగా పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం

పరిశ్రమ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉత్పత్తిలోకి వచ్చే వరకు ప్రభుత్వ సాయం

ఉపాధి అవకాశాలు... పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం

అంకుర సంస్థలను ప్రోత్సహించడం ద్వారా కొత్త పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దడం

ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పెట్టుబడుల ఆకర్షణ

పాలసీలో ప్రత్యేకతలు

ఐటీ ఆధారిత అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి విశాఖ కేంద్రంగా ‘స్టార్టప్‌ మిషన్‌’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చే అంకుర సంస్థలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు విశాఖలో ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ‘ఐ-స్పేస్‌’ మల్టీ డొమైన్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను పర్యవేక్షిస్తుంది. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఆర్‌ అండ్‌ డి), పర్యావరణ హిత నూతన ఆవిష్కరణల కేంద్రంగా ఐ-స్పేస్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇంక్యుబేటర్‌లు, కో-వర్కింగ్‌ స్పేస్‌ అందుబాటులో ఉంటుంది. సంస్థలను ఏర్పాటు చేయడం నుంచి నిర్వహణ వరకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడం.. నిర్వహణలో అవసరమైన సహకారాన్నీ స్టార్టప్‌ మిషన్‌ పర్యవేక్షిస్తుంది. దీనికి అవసరమైన సీడ్‌ క్యాపిటల్‌ను కార్పస్‌ ఫండ్‌గా ప్రభుత్వం సమకూరుస్తుంది.

భవిష్యత్తులో ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కులు/హబ్స్‌ విస్తీర్ణంలో కనీసం 5 శాతం లాజిస్టిక్స్‌, గోదాముల ఏర్పాటుకు కేటాయించాలని నిర్ణయం. వాటి ఏర్పాటును ప్రత్యేక ప్రోత్సాహకాలను చెల్లించాలని నిర్ణయం. గోదాములకు రూ.5 కోట్లు, కోల్డు స్టోరేజీలకు రూ.3 కోట్లు, మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ప్రైవేటు రంగంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌ను అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఆర్‌అండ్‌డి సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం. ఏపీఐఐసీ ద్వారా కొత్తగా అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో 33 శాతం ఎంఎస్‌ఎంఈలకు కేటాయింపు. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ఎస్‌సీలకు 16.2 శాతం, ఎస్‌టీలకు 6 శాతం విస్తీర్ణాన్ని కేటాయించాలి. ప్రైవేటు రంగంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కనీసం 25 ఎకరాల భూములు ఉండాలి. వాటి అభివృద్ధిని ప్రోత్సహించేలా..

మౌలిక సదుపాయాల కల్పనకు చేసిన ఖర్చులో 25 శాతం.. గరిష్ఠంగా రూ.కోటి రాయితీ

స్టాంపు డ్యూటీ పూర్తిగా మినహాయింపు

భూముల వినియోగ మార్పిడి ఛార్జీల మినహాయింపు

దీర్ఘకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటులో 3 శాతం రాయితీ.. గరిష్ఠంగా మూడేళ్లలో రూ.కోటి రాయితీ

50 శాతం ఆక్యుపెన్సీ ఉంటే... ప్రోత్సాహకాల్లో 50 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.

ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి

కనీసం 50 ఎకరాలు.. రూ.200 కోట్ల థ్రెషోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండాలి.

పార్కు అభివృద్ధి చేసే విస్తీర్ణంలో 33 శాతం నివాస/వాణిజ్య ప్రాంతం కింద కేటాయించాలి.

మధ్య తరహా పరిశ్రమలు

పెట్టుబడి రాయితీ/ఎస్‌జీఎస్‌టీ: ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌పై 5 ఏళ్లలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.2.5 కోట్లు సమ వాయిదాల్లో చెల్లింపు లేదా నెట్‌ ఎస్‌జీఎస్‌టీలో 50 శాతం వంతున 5 ఏళ్ల పాటు చెల్లింపు

ఐపీ సేకరణ వ్యయంలో 75 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు

టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు

పైపు ద్వారా నీటి సరఫరాకు చేసిన ఖర్చుపై అప్పటి ధరలకు అనుగుణంగా రాయితీ మొత్తం నిర్ణయం

భారీ పరిశ్రమలకు... నెట్‌ ఎస్‌జీఎస్‌టీ చెల్లింపు

కేటగిరీ-1: స్థిర మూలధనానికి సమానమైన (భూముల ధరతో కలిపి) నెట్‌ ఎస్‌జీఎస్‌టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు.

కేటగిరీ-2: స్థిర మూలధనంలో 75 శాతానికి సమానమైన (భూముల ధర మినహాయించి) నెట్‌ ఎస్‌జీఎస్‌టీ 5 ఏళ్ల పాటు

కేటగిరీ-3: స్థిర మూలధనంలో 50 శాతానికి సమానమైన (భూముల ధర మినహాయించి) నెట్‌ ఎస్‌జీఎస్‌టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు

పైపులైను ద్వారా నీటి సరఫరా కోసం చేసిన ఖర్చుపై అప్పటి ధరల ప్రకారం నిర్ణయం.

 మెగా పరిశ్రమలకు చెల్లించే రాయితీలను అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం.

రాష్ట్రం మూడు జోన్‌లుగా విభజన

పారిశ్రామికంగా తక్కువ అభివృద్ధి చెందిన జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటును ప్రోత్సహించాలన్నది ఉద్దేశంతో.. జిల్లాలను మూడు జోన్‌లుగా విభజించింది.

ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం..

తక్కువ పారిశ్రామికాభివృద్ధి జిల్లాలు: అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కర్నూలు, కృష్ణా, నంద్యాల, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, వైయస్‌ఆర్‌, అల్లూరి సీతారామరాజు.

మోడరేట్‌ పారిశ్రామికాభివృద్ధి సాధించిన జిల్లాలు: చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, విజయనగరం.

అధిక పారిశ్రామికాభివృద్ధికి చెందిన జిల్లాలు: అనకాపల్లి, తిరుపతి, విశాఖపట్నం
   మధ్య తరహా పరిశ్రమలు

పెట్టుబడి రాయితీ/ఎస్‌జీఎస్‌టీ: ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌పై 5 ఏళ్లలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.2.5 కోట్లు సమ వాయిదాల్లో చెల్లింపు లేదా నెట్‌ ఎస్‌జీఎస్‌టీలో 50 శాతం వంతున 5 ఏళ్ల పాటు చెల్లింపు.

ఐపీ సేకరణ వ్యయంలో 75 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు

టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు

పైపు ద్వారా నీటి సరఫరాకు చేసిన ఖర్చుపై అప్పటి ధరలకు అనుగుణంగా రాయితీ మొత్తం నిర్ణయం

భారీ పరిశ్రమలకు నెట్‌ ఎస్‌జీఎస్‌టీ చెల్లింపు

కేటగిరీ-1: స్థిర మూలధనానికి సమానమైన(భూముల ధర మినహాయించి) నెట్‌ ఎస్‌జీఎస్‌టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు.

కేటగిరీ-2: స్థిర మూలధనంలో 75 శాతానికి సమానమైన(భూముల ధర మినహాయించి) నెట్‌ ఎస్‌జీఎస్‌టీ 5 ఏళ్ల పాటు

కేటగిరీ-3: స్థిర మూలధనంలో 50 శాతానికి సమానమైన(భూముల ధర మినహాయించి) నెట్‌ ఎస్‌జీఎస్‌టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు

పైపులైను ద్వారా నీటి సరఫరా కోసం చేసిన ఖర్చుపై అప్పటి ధరల ప్రకారం నిర్ణయం.

మెగా పరిశ్రమలకు చెల్లించే రాయితీలను అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం.

ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే పెట్టుబడి ప్రోత్సాహకాలు

పెట్టుబడిలో 45 శాతం.. గరిష్ఠంగా రూ1.20 లక్షలు.

వడ్డీ రాయితీ

వడ్డీ రేటులో 9 శాతం రాయితీ.. గరిష్ఠంగా 5 ఏళ్లలో రూ.50 లక్షలు
ఎస్‌జీఎస్‌టీ:

5 ఏళ్ల పాటు ఎస్‌జీఎస్‌టీ 100 శాతం తిరిగి చెల్లింపు

స్టాంపు డ్యూటీ 100 శాతం చెల్లింపు (అన్ని కేటగిరీలకు వర్తింపు)

భూమి కొనుగోలు చేసిన వ్యయంలో 50 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు

భూ వినియోగ మార్పిడి ఛార్జీల్లో 25 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు

విద్యుత్‌ సుంకం యూనిట్‌కు రూపాయి వంతున.. యూనిట్‌కు 50 పైసల రాయితీ ఏళ్ల పాటు వర్తింపు

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ(ఐపీ) సేకరణకు చేసే ఖర్చులో 75 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు

టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు

నాణ్యత ధ్రువీకరణ పత్రాలకు చేసే ఖర్చు 100 శాతం.. గరిష్ఠంగా రూ.3 లక్షలు

పైపు ద్వారా నీటి సరఫరా కోసం చేసే ఖర్చును అప్పటి ధరల ఆధారంగా నిర్ణయం.

రవాణా వాహనాలను తీసుకుంటే.. మూలధన సబ్సిడీ కింద 45 శాతం.. గరిష్ఠంగా రూ.75 లక్షలు రాయితీ

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే పెట్టుబడి ప్రోత్సాహకాలు

జనరల్‌ కేటగిరీ: పెట్టుబడిలో 15 శాతం.. గరిష్ఠంగా రూ20 లక్షలు.

బీసీ/మైనారిటీలు: పెట్టుబడిలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.20 లక్షలు

మహిళలు: పెట్టుబడిలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.30 లక్షలు

వడ్డీ రాయితీ

జనరల్‌: వడ్డీ రేటులో 3 శాతం రాయితీ.. గరిష్ఠంగా 5 ఏళ్లలో రూ.25 లక్షలు

బీసీ/మైనారిటీలు: వడ్డీ రేటులో 3 శాతం రాయితీ.. గరిష్ఠంగా 5 ఏళ్లలో రూ.30 లక్షలు

ఎస్‌జీఎస్‌టీ: 5 ఏళ్ల పాటు ఎస్‌జీఎస్‌టీ 100 శాతం తిరిగి చెల్లింపు(అన్ని కేటగిరీలకు ఇవే నిబంధనలు వర్తింపు)

ఇతరాలు

స్టాంపు డ్యూటీ 100 శాతం చెల్లింపు (అన్ని కేటగిరీలకు వర్తింపు)

భూ వినియోగ మార్పిడి ఛార్జీల్లో 25 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు

విద్యుత్‌ సుంకం యూనిట్‌కు రూపాయి వంతున.. 5 ఏళ్ల పాటు చెల్లింపు

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ (ఐపీ) సేకరణకు చేసే ఖర్చులో 75%.. గరిష్ఠంగా రూ.10లక్షలు

టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు

నాణ్యత ధ్రువీకరణ పత్రాలకు చేసే ఖర్చు 100 శాతం.. గరిష్ఠంగా రూ.3 లక్షలు

పైపు ద్వారా నీటి సరఫరా కోసం చేసే ఖర్చును అప్పటి ధరల ఆధారంగా నిర్ణయం.

సేవా రంగంలోని పరిశ్రమలకు: అనుమతించిన పరిశ్రమల ఏర్పాటుకు చేసే మూలధన పెట్టుబడిలో 15శాతం.. గరిష్ఠంగా రూ.20లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని