దర్గాలో పంచాంగ పఠనం

మత సామరస్యానికి కర్నూలు జిల్లా కౌతాళంలోని జగద్గురు ఖాదర్‌లింగా స్వామి దర్గా వేదికయింది.

Published : 23 Mar 2023 04:02 IST

మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహణ

కౌతాళం, న్యూస్‌టుడే: మత సామరస్యానికి కర్నూలు జిల్లా కౌతాళంలోని జగద్గురు ఖాదర్‌లింగా స్వామి దర్గా వేదికయింది. బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఈ దర్గాలో పంచాంగ పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లింలు, హిందువులు పాల్గొన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని పండితుడు తెలిపారు. ఉగాది రోజున ఈ దర్గాలో పంచాంగ పఠనం చేయడం సంప్రదాయంగా వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని