నేత్రపర్వం.. మల్లన్న రథోత్సవం

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం శోభాయమానంగా జరిగింది.

Updated : 23 Mar 2023 06:39 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం శోభాయమానంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణం నుంచి మంగళవాయిద్యాల మధ్య తీసుకొచ్చి రథంపై అధిష్ఠింపజేశారు. లక్షల మంది భక్తుల శివనామ స్మరణల మధ్య ప్రధాన పురవీధిలో రథోత్సవం రమణీయంగా జరిగింది. రథోత్సవం అనంతరం భక్తులు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి భక్తులకు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని