డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

దేశవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల డీలర్లకు ఒకే రకమైన కమీషన్‌ లేదా గౌరవ వేతనం ఇవ్వాలని అఖిల భారత రేషన్‌ డీలర్ల సమాఖ్య నాయకులు డిమాండు చేశారు.

Updated : 23 Mar 2023 05:48 IST

అఖిల భారత రేషన్‌ డీలర్ల సమాఖ్య డిమాండు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల డీలర్లకు ఒకే రకమైన కమీషన్‌ లేదా గౌరవ వేతనం ఇవ్వాలని అఖిల భారత రేషన్‌ డీలర్ల సమాఖ్య నాయకులు డిమాండు చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ దిల్లీ జంతర్‌మంతర్‌ రోడ్డులో సమాఖ్య ఆధ్వర్యంలో డీలర్లు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేషన్‌ డీలర్ల సమాఖ్య ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మునగా గిరిజారావు మాట్లాడుతూ.. డీలర్లకు గౌరవ వేతనంగా నెలకు రూ. 50 వేలు ఇవ్వాలని కోరారు. అధికారులు వేధింపులను అరికట్టాలని, బియ్యం, గోధుమలు, పంచదార వంటి సరకుల్లో క్వింటాకు ఒక కిలో తరుగుకు అంగీకరించాలని కోరారు. కరోనాతో చనిపోయిన డీలర్లకు రాజస్థాన్‌ ప్రభుత్వం చెల్లించినట్లే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. ధర్నాలో సమాఖ్య రాష్ట్ర నాయకులు కూరపాటి సుబ్బారావు, కేఎస్‌వీ రామారావు, ఖాజా మొహియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు