సంస్కృతి, సంప్రదాయాలు మరవొద్దు

మనదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు.

Updated : 23 Mar 2023 05:47 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: మనదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాస్త్ర, సాంకేతిక తదితర రంగాల్లో దేశం ప్రగతిపథంలో నడుస్తోందన్నారు. బ్రిటీష్‌ వాళ్లు 200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించి మన సంస్కృతి, సంపదను నాశనం చేశారని, దానిని తిరిగి అత్యంత వేగంగా పునర్‌ నిర్మించుకుంటున్నామన్నారు. కొవిడ్‌కు వ్యాక్సిన్‌ కనుగొన్నామని, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. పాత పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి మరచి పోకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ పెద్దలపై ఉందన్నారు. ఉగాది రోజున మంచి నిర్ణయం తీసుకుని అందరికీ మార్గదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబ పెద్ద ఆదర్శంగా ఉంటే పిల్లలు కూడా మంచి నడవడికతో ఎదుగుతారని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాడుగుల నాగఫణిశర్మ, గజల్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి, ఎస్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ, బీఎస్‌ శర్మ, కూచి, డీవీఎస్‌బీ రామ్మూర్తితోపాటు పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని