జులై-ఆగస్టులో డీఎస్సీకి ప్రయత్నిస్తున్నాం

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఈ ఏడాది జులై-ఆగస్టులో డీఎస్సీ ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Updated : 24 Mar 2023 04:55 IST

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఈ ఏడాది జులై-ఆగస్టులో డీఎస్సీ ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లాల వారీగా ఖాళీలు, అదనపు అవసరాల వివరాలతో నివేదిక తయారుచేసి త్వరలో సీఎం ఆమోదం తీసుకుంటామని అన్నారు. సచివాలయంలోని మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటించకపోయినా... వివిధ దశల్లో 12,540 ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేశాం. మిగతా ఖాళీల భర్తీకి డీఎస్సీ ప్రకటించాలన్న సీఎం ఆదేశాలపై నివేదిక తయారు చేయాలని అధికారులను కోరాం. రాష్ట్రంలో 53 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించినట్లు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చెప్పింది వాస్తవం కాదు. 53 వేల ఖాళీలు ఉన్నాయనేది తప్పు. కొవిడ్‌కు ముందు నాటి సమాచారమది. ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదిస్తే సభాపతి చెబుతారు కదా? గంటా తన ప్రచారం కోసం చెబితే... మేమెందుకు సమాధానమివ్వాలి’ అని మంత్రి బొత్స అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని