మినహాయించిన సీపీఎస్‌ వాటా మొత్తాలు జమ చేయాలి

జీతాల నుంచి 12 నెలలు మినహాయించిన సీపీఎస్‌ వాటాతోపాటు ప్రభుత్వ వాటా కలిపి తమ ప్రాన్‌ ఖాతాల్లో జమ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు.

Published : 24 Mar 2023 05:24 IST

ఏపీ సచివాలయం సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం వినతి

ఈనాడు, అమరావతి: జీతాల నుంచి 12 నెలలు మినహాయించిన సీపీఎస్‌ వాటాతోపాటు ప్రభుత్వ వాటా కలిపి తమ ప్రాన్‌ ఖాతాల్లో జమ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కోట్ల రాజేశ్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 12 నెలల పాటు సీపీఎస్‌ వాటాను ఉద్యోగుల ఖాతాలకు జమ చేయకపోవడం ఆందోళనకరం. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి అదనపు రుణ పరిమితిని మంజూరు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ గానీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం విషయంలో తగు చర్యలు తీసుకోలేదు. లోపభూయిష్టమైన సీపీఎస్‌ విధానాన్ని బలవంతంగా ఉద్యోగులపై రుద్దడం అన్యాయం. ప్రభుత్వమే అన్యాయం చేస్తే.. భవిష్యత్తులో పెన్షన్‌ ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలు ద్రోహం చేయవా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అంబటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు నాపా ప్రసాద్‌, మాధవిలత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని