Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

Updated : 24 Mar 2023 08:31 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు