బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలన్న తీర్మానంపై నిరసన

బోయ, వాల్మీకి సామాజికవర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 25 Mar 2023 03:26 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: బోయ, వాల్మీకి సామాజికవర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివాసీ జేఏసీ, గిరిజన సంఘం, ప్రజా సంఘాలు, అఖిలపక్షం నేతలు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేల చిత్రపటాలు పట్టుకొని శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం జగన్‌.. గిరిజనుల ద్రోహి అని ఆరోపించారు. ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర మాట్లాడుతూ గిరిజన హక్కులు కాలరాసే తీర్మానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని