జలాశయాలపై పీఎస్‌పీల ప్రభావం ఉండదు

పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల(పీఎస్‌పీ) నిర్మాణం, నిర్వహణ వల్ల రిజర్వాయర్ల నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకం ఉండదని నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీ) ఎండీ రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 25 Mar 2023 03:26 IST

ఎన్‌ఆర్‌ఈడీసీ ఎండీ రమణారెడ్డి

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల(పీఎస్‌పీ) నిర్మాణం, నిర్వహణ వల్ల రిజర్వాయర్ల నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకం ఉండదని నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీ) ఎండీ రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎర్రవరం, పెదకోట వద్ద నిర్మించనున్న పీఎస్‌పీలతో అనకాపల్లి జిల్లాలోని తాండవ, రైవాడ జలాశయాలపై ప్రభావం చూపుతుందని జలవనరుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై ‘నీళ్లు లేవంటూనే.. పెద్దలకు ధారపోస్తున్నారు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎన్‌ఆర్‌ఈడీసీ ఎండీ.. పీఎస్‌పీల తరఫున వివరణ ఇచ్చారు. తాండవ, రైవాడ రిజర్వాయర్లు నిండిన తర్వాతనే జూన్‌ నుంచి అక్టోబరు మధ్య వర్షాకాలంలోనే పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు అవసరమైన నీటిని ఒక్కసారే తీసుకుంటారని తెలిపారు. తర్వాత ఏడాది నుంచి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే వినియోగించుకుంటారని...ప్రతిపాదిత పీఎస్‌పీల ప్రభావం ఆ రెండు జలాశయాలపై ఉండదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని