పన్నుల వసూలుకు దౌర్జన్యం చేస్తారా?

జరిమానా, పన్నులు కట్టని వారిపై దౌర్జన్యం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా కడప నగరపాలక అధికారులను ప్రశ్నించారు.

Published : 26 Mar 2023 03:44 IST

అధికారులపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

కడప నగరపాలక, న్యూస్‌టుడే: జరిమానా, పన్నులు కట్టని వారిపై దౌర్జన్యం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా కడప నగరపాలక అధికారులను ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరపాలక కార్యాలయంలో మేయర్‌ సురేష్‌బాబు అధ్యక్షతన నగరపాలక బడ్జెట్‌ సమావేశం శనివారం నిర్వహించారు. అధికారులు పన్నులు వసూలు చేస్తున్న విధానంపై ఉపముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, దుకాణం ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు పన్నులు చెల్లించలేదని కడప బీకేఎం వీధిలోని ఓ దుకాణం బోర్డును కత్తితో కోశారని నా దృష్టికి వచ్చింది. పన్నుల వసూళ్లకు 20-30 మంది ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనీ ఫిర్యాదులున్నాయి.ప్రజలతో ఘర్షణ పడడానికి మీరేమైనా వీధి రౌడీలా?.. పన్నులు చట్టప్రకారం వసూలు చేసుకోవాలి. మేము కూడా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందన్న విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలి’ అని ఉపముఖ్యమంత్రి హెచ్చరించారు. చెత్త పన్నును 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేస్తామని నగర మేయర్‌ సురేష్‌బాబు తెలిపారు.ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా దీనిపై మాట్లాడుతూ ఇక నుంచి ‘చెత్తపన్ను’ అనరాదని, దీన్ని యూజర్‌ ఛార్జీగా పిలవాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు