సీసీఎల్‌-2023 విజేత.. తెలుగు వారియర్స్‌ జట్టు

ఉత్సాహంగా.. ఉత్కంఠగా సాగిన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌)-2023 పోటీల్లో తెలుగు వారియర్స్‌ జట్టు విజేతగా నిలిచింది.

Published : 26 Mar 2023 04:18 IST

చెలరేగి ఆడిన అఖిల్‌ అక్కినేని

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఉత్సాహంగా.. ఉత్కంఠగా సాగిన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌)-2023 పోటీల్లో తెలుగు వారియర్స్‌ జట్టు విజేతగా నిలిచింది. విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో శనివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భోజ్‌పురి దబాంగ్స్‌, తెలుగు వారియర్స్‌ జట్ల మధ్య ఫైనల్‌ పోరు జరిగింది. తెలుగు వారియర్స్‌ కెప్టెన్‌ అక్కినేని అఖిల్‌ చెలరేగి ఆడాడు. 67 (32 బంతులు, 2్ఠ4, 6్ఠ6) పరుగులతో అర్ధ శతకం చేశాడు. సినీ నటులు విక్టరీ వెంకటేష్‌, శ్రీకాంత్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి వరకు జట్టు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కనిపించారు. సీసీఎల్‌లో టీ-20 మ్యాచ్‌లను 10 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లుగా ఆడారు. భోజ్‌పురి దబాంగ్స్‌ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 161 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా అఖిల్‌ ఎంపికయ్యాడు. ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు రావడంతో స్టేడియంలో గ్యాలరీలన్నీ కిటకిటలాడాయి. సీసీఎల్‌-2023 సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని