విద్యుత్తు రాయితీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది

వివిధ సంక్షేమ పథకాల కింద అందించే విద్యుత్తుకు సంబంధించి రూ.10,135 కోట్ల రాయితీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 02:42 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఈనాడు, అమరావతి: వివిధ సంక్షేమ పథకాల కింద అందించే విద్యుత్తుకు సంబంధించి రూ.10,135 కోట్ల రాయితీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అధిక విద్యుత్తును వినియోగించే ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు మినహా..మిగిలిన వినియోగదారులపై ఛార్జీల భారం పడకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం విద్యుత్తు వినియోగదారులతో వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు రూ.7,641.85 కోట్లు, ఆక్వాకల్చర్‌ రంగానికి రూ.1,206.20 కోట్లు, ఎస్సీ. ఎస్టీ, ఎంబీసీ, దోబీఘాట్‌లు, ఇతర వర్గాల వినియోగదారులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు రాయితీ కింద రూ.1,238.30 కోట్లను ప్రభుత్వం భరించనుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని