Vijayawada: విజయవాడ- శిర్డీ విమాన సర్వీసు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శిర్డీకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజువారీ ప్రత్యేక విమాన సర్వీసును ఇండిగో సంస్థ ఆదివారం ప్రారంభించింది.

Updated : 27 Mar 2023 11:01 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శిర్డీకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజువారీ ప్రత్యేక విమాన సర్వీసును ఇండిగో సంస్థ ఆదివారం ప్రారంభించింది. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా శిర్డీ సర్వీసు రాకపోకలు ఉంటాయని అధికారులు తెలిపారు. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏటీఆర్‌72-600 విమానం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకుంది. 12:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి శిర్డీ వెళ్లింది. శిర్డీ నుంచి మధ్యాహ్నం 02:20 గంటలకు బయలుదేరి 4:26 గంటలకు విజయవాడ చేరుకొనేలా నిత్యం మరో సర్వీసు నడుస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. టికెట్‌ ప్రారంభ ధర రూ.4,639గా నిర్ణయించారు. ప్రయాణ తేదీ దగ్గరపడినకొద్దీ డిమాండ్‌ ఆధారంగా టికెట్‌ ధర పెరుగుతుంది. తొలిరోజు 70మంది శిర్డీ తరలివెళ్లారు. శిర్డీ నుంచి విజయవాడకు 65మంది చేరుకున్నారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని