ఎమ్మెల్యే అనిల్‌ ఫ్లెక్సీకి పోలీసుల పహారా

నెల్లూరు నగరంలో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ కటౌట్‌కు ఏకంగా సీఐతో పాటు 15 మంది పోలీసులు కాపలా ఉన్నారు.

Updated : 27 Mar 2023 10:21 IST

నెల్లూరు, న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ కటౌట్‌కు ఏకంగా సీఐతో పాటు 15 మంది పోలీసులు కాపలా ఉన్నారు. రెండు రోజుల క్రితం అనిల్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా నర్తకి సెంటరులో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి అనిల్‌ కటౌట్‌ అడ్డుగా ఉందని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను తెదేపా నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. ఆదివారం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నర్తకి సెంటరుకు వచ్చారు. ఫ్లెక్సీ తొలగిస్తారనే అనుమానంతో పోలీసులను రక్షణగా ఏర్పాటు చేశారు. నగరంలో కటౌట్లు, ఫ్లెక్సీలపై నిషేధంఅంటూనే ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు