బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే తీర్మానంపై ఆదివాసీల నిరసన

బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసనసభలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం చినార్కూరులో ఆదివాసులు ఉరి తాళ్లను మెడకు వేసుకుని ఆదివారం నిరసన తెలిపారు.

Published : 27 Mar 2023 02:42 IST

కూనవరం, న్యూస్‌టుడే: బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసనసభలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం చినార్కూరులో ఆదివాసులు ఉరి తాళ్లను మెడకు వేసుకుని ఆదివారం నిరసన తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సంఘ డివిజన్‌ అధ్యక్షుడు కుంజా అనిల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్టీ జాబితాలోకి కొత్త కులాలను చేర్చి నిజమైన ఆదివాసులకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దీనిపై ఆదివాసీ ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో చంద్రరావు, కన్నారావు, చంటి, ఆనంద్‌, వెంకట్‌, ముత్తయ్య, వంశీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని