ఏపీ క్రెడాయ్‌ ఛైర్మన్‌గా ఆళ్ల శివారెడ్డి

క్రెడాయ్‌ నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశం విశాఖలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా క్రెడాయ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Published : 27 Mar 2023 02:42 IST

విశాఖపట్నం(మాధవధార), న్యూస్‌టుడే: క్రెడాయ్‌ నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశం విశాఖలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా క్రెడాయ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా ప్రముఖ బిల్డర్‌ ఆళ్ల శివారెడ్డి(గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా వై.వి.రమణారావు(విజయవాడ), ప్రధాన కార్యదర్శిగా బయ్యన శ్రీనివాస్‌(విశాఖపట్నం), ఉపాధ్యక్షులుగా జి.వి.ఎస్‌.టి.రాయుడు(కాకినాడ), కె.సుభాష్‌ చంద్రబోస్‌(విజయనగరం), జె.సురేష్‌కుమార్‌రెడ్డి(కర్నూలు), కోశాధికారిగా పి.రాజశేఖర్‌రావు(తిరుపతి), సంయుక్త కార్యదర్శులుగా భీమ శంకర్‌(రాజమహేంద్రవరం), కె.రమేష్‌ అంకినీడు(విజయవాడ)ను ఎన్నుకున్నారు. వీరంతా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. సభ్యులందరి సహకారంతో క్రెడాయ్‌ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన సేవలు అందించనున్నట్లు నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. సమావేశంలో సంస్థ పూర్వ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రెడాయ్‌ లేఅవుట్‌లలో 5 శాతం జగనన్న లేఅవుట్‌లకు కేటాయించాలన్న నిబంధనను సభ్యుల వినతి మేరకు తొలగించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని