సిక్కోలులోనూ మొదలైన ప్రైవేటు సీనరేజి వసూళ్లు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేటు సంస్థ ద్వారా ఖనిజాలకు సీనరేజి వసూలు మొదలైంది. టెండరు పొందిన విశ్వ సముద్ర సంస్థ ఈనెల 22 నుంచి సీనరేజి వసూళ్లు ఆరంభించినట్లు గనులశాఖ వర్గాలు తెలిపాయి.

Published : 27 Mar 2023 02:44 IST

ఈనాడు, అమరావతి: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేటు సంస్థ ద్వారా ఖనిజాలకు సీనరేజి వసూలు మొదలైంది. టెండరు పొందిన విశ్వ సముద్ర సంస్థ ఈనెల 22 నుంచి సీనరేజి వసూళ్లు ఆరంభించినట్లు గనులశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజి వసూళ్లకు టెండర్లు పిలిస్తే శ్రీకాకుళంతోపాటు చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి జిల్లాలకు రెండోసారి స్పందన వచ్చింది. ఇందులో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో టెండరు పొందిన సంస్థలు సీనరేజి వసూళ్లు చేపట్టాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిడ్‌ దక్కించుకున్న సుధాకర్‌ ఇన్‌ఫ్రా సంస్థ మాత్రం ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభించలేదు. మిగిలిన 8 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజి వసూళ్లకు మళ్లీ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు