భద్రాద్రి రామయ్యకు నూతన ముత్తంగి అలంకారం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రతి సోమవారం ముత్తంగి(ముత్యాలు పొదిగిన వస్త్రం) రూపంలో అలంకరణ చేస్తుంటారు.

Updated : 27 Mar 2023 06:26 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రతి సోమవారం ముత్తంగి(ముత్యాలు పొదిగిన వస్త్రం) రూపంలో అలంకరణ చేస్తుంటారు. గతంలో ఓ దాత ఇచ్చిన ఈ అలంకారం పాతబడింది. ఆలయ అర్చకుల చొరవతో హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌రెడ్డి రూ.30 లక్షలు వెచ్చించి నూతన అలంకారాన్ని తయారు చేయించారు. ఈ అలంకార వస్త్రాలకు ఆదివారం సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులుకు అందించారు.

నిత్య హోమాలు.. చతుర్వేదాల పఠనం

శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో ఆదివారం నిత్య హోమాలు నిర్వహించారు. రుత్విక్కులు చతుర్వేదాలను పఠించారు. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సంక్షేప రామాయణాన్ని సామూహికంగా పారాయణం చేశారు. శ్రీసుదర్శనేష్టి హోమం నిర్వహించారు. సోమవారం ధ్వజపట భద్రక మండల లేఖన పూజలు ఉంటాయని స్థానాచార్యులు స్థలసాయి తెలిపారు. ఈ పటాన్ని స్థానిక జీయర్‌ మఠం నుంచి తీసుకువచ్చి రామాలయంలో గరుడాధివాసం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని