ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడమే

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జీని అరెస్టు చేయడం ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడమేనని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం పోలీసుల్ని పావులుగా వాడుకుంటూ విచక్షణా రహితంగా అరెస్టులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరరావు, సాబ్జీ ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 27 Mar 2023 04:39 IST

సాబ్జీ గృహనిర్బంధంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

ఈనాడు, అమరావతి: పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జీని అరెస్టు చేయడం ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడమేనని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం పోలీసుల్ని పావులుగా వాడుకుంటూ విచక్షణా రహితంగా అరెస్టులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరరావు, సాబ్జీ ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ అనుమానిస్తోంది. సీఎం దెందులూరు పర్యటనకు ప్రొటోకాల్‌ ప్రకారం ఎమ్మెల్సీ సాబ్జీని ప్రభుత్వం ఆహ్వానించింది. ఆ తర్వాత పై నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. దీన్ని బట్టి ప్రతి అంశాన్ని డీజీపీ కార్యాలయమో, సీఎం కార్యాలయమో నిర్ణయిస్తోందని అర్థమవుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అన్న స్పృహ కూడా అధికారులకు లేదు. ఇది సభ్యుని గౌరవమర్యాదలకు సంబంధించిన అంశం. ఈ అంశాన్ని ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు తీసుకెళ్తాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని