Gudivada Amarnath : మంత్రి గారికి కోపమొచ్చింది

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం కారణంగా అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీవేటు పడింది.

Published : 27 Mar 2023 09:12 IST

ఇద్దరు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులపై బదిలీ వేటు

అనకాపల్లి, న్యూస్‌టుడే: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం కారణంగా అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీవేటు పడింది. మంగళవారం నుంచి అనకాపల్లిలోని నూకాలమ్మ దేవాలయం నెల జాతర ప్రారంభంకాగా మొదటిరోజు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో నైవేద్యం నివేదన నిమిత్తం దర్శనాలు నిలిపివేయడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి మంత్రి దాదాపు 45 నిమిషాలు నిరీక్షించాల్సి వచ్చింది. తనకు ముందుగా దర్శన సమయాలు తెలియజేయలేదంటూ ఆయన ఆగ్రహించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేవాదాయశాఖ ఇన్‌ఛార్జి అధికారి బుద్ద నగేష్‌తో పాటు అనకాపల్లి నూకాలమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌ను బదిలీ చేస్తూ దేవాదాయశాఖ అధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారిగా సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నూకాలమ్మ ఆలయ బాధ్యతలు విశాఖ వైభవ వెంకటేశ్వర దేవస్థానం ఈఓ బండారు ప్రసాద్‌కు అదనంగా అప్పగించారు. దీనిపై దేవాదాయ శాఖ జిల్లా అధికారి నగేష్‌ను వివరణ కోరగా ఆదివారం సాయంకాలం బదిలీ ఉత్తర్వులు అందాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని