వీఆర్‌ఏల డీఏ రద్దు దుర్మార్గం: బొప్పరాజు

గ్రామ రెవెన్యూ సహాయకులకు దశాబ్దాలుగా ఇస్తున్న డీఏను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:52 IST

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: గ్రామ రెవెన్యూ సహాయకులకు దశాబ్దాలుగా ఇస్తున్న డీఏను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో ఆదివారం రాష్ట్ర వీఆర్‌ఏల నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా బొప్పరాజు మాట్లాడారు. వీఆర్‌ఏలకు డీఏ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. వీరినీ ముఖ ఆధారిత హాజరు అడగటం శోచనీయమన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడిగా గరికపాటి

ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గరికపాటి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా తలారి సీతారామ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జి.జయరాజు బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా బి.వెంకట్రావు (తూర్పుగోదావరి జిల్లా), జి.టి.రామాంజనేయులు (కర్నూలు), కోశాధికారిగా చెన్నుపల్లి సత్యనారాయణ (బాపట్ల) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఆరేపల్లి సాంబశివరావు (ఏపీ వీఆర్వోల అసోసియేషన్‌), డి.ఈశ్వర్‌ (ఏపీ ఐకాస అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని