Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!

బాపట్లలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు వైకాపా రంగులు వేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రాంతీయ ఆసుపత్రిని రూ.3.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు.

Published : 27 Mar 2023 06:42 IST

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్లలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు వైకాపా రంగులు వేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రాంతీయ ఆసుపత్రిని రూ.3.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ పతాకాల రంగులు వేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు ఆసుపత్రి భవనాలకు అధికార పార్టీ పతాకం స్ఫురించేలా రంగులు వేయించటంపై రోగులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థను ప్రశ్నించగా.. ఆసుపత్రిలో పనులు ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. సంస్థ ఉన్నతాధికారులు నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాంతీయ వైద్యశాల భవనాలకు గుత్తేదారుతో రంగులు వేయించినట్లు ఇంజినీర్లు తెలిపారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని