కమిటీ సిఫార్సు మేరకే పోలవరం అంచనా వ్యయం తగ్గింపు

పోలవరం అంచనా వ్యయాన్ని 2017-18 సంవత్సరాల లెక్కల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా 2019లో సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) చేసిన సిఫార్సును జల్‌శక్తి సలహా కమిటీ ఆమోదించినా.. ఆ తర్వాత కమిటీ ఆ మొత్తాన్ని తగ్గించిందని జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.

Published : 28 Mar 2023 03:37 IST

జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు

ఈనాడు, దిల్లీ: పోలవరం అంచనా వ్యయాన్ని 2017-18 సంవత్సరాల లెక్కల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా 2019లో సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) చేసిన సిఫార్సును జల్‌శక్తి సలహా కమిటీ ఆమోదించినా.. ఆ తర్వాత కమిటీ ఆ మొత్తాన్ని తగ్గించిందని జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2020, మార్చిలో నియమించిన ఆర్‌సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని 2013-14 లెక్కల ప్రకారం రూ.29,027.95 కోట్లుగా, 2017-18 లెక్కల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా సిఫార్సు చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.13,463.21 కోట్లు చెల్లించామన్నారు.

* పోలవరం పూర్తి రిజర్వాయరు మట్టం 45.72 మీటర్లుగా గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ పేర్కొందని.. దాన్ని తగ్గించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనపై తమకు అవగాహన లేదని జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని