ప్రాథమిక విద్యావిధానంలో నూతన మార్పులు

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక విద్యా విధానంలో సీబీఎస్‌ఈ బోర్డు మార్పులు తీసుకొచ్చింది.

Updated : 28 Mar 2023 06:25 IST

ప్రకటించిన సీబీఎస్‌ఈ

ఈనాడు, అమరావతి: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక విద్యా విధానంలో సీబీఎస్‌ఈ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫౌండేషన్‌ స్టేజ్‌ (ఎన్‌సీఎఫ్‌ఎఫ్‌ఎస్‌)ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు సిలబస్‌తో పాటు ఇతర అంశాల్లోనూ మార్పులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాల అంచనా, అభ్యాసన, విధానాలకు సంబంధించి ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రస్తుతం ప్రతి చిన్నారికి కంటిచూపు,   వినికిడి, ఇతర వైద్య పరీక్షలు చేస్తుండగా వీటితో పాటు ప్రవేశాల సమయంలోనే వారి ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న మందులు తదితర వివరాలను విద్యాసంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఆటలు ఆడుకునేందుకు సదుపాయాలు కల్పించాలి. ఈ తరగతులు గ్రౌండ్‌ లేదా మొదటి అంతస్తులో మాత్రమే ఉండాలని సీబీఎస్‌ఈ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. తగినంత వెలుతురు వచ్చే తరగతులు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, తరగతి గదుల్లో కాంక్రీట్‌ అంచులు గుండ్రగా ఉండాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని