భక్తుల కోసం 10 విద్యుత్‌ ధర్మరథం బస్సులు

తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భక్తులకు ఉచితంగా రవాణా వసతి కల్పించేందుకు పది నూతన విద్యుత్‌ ధర్మరథాలను తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు.

Updated : 28 Mar 2023 06:36 IST

విరాళంగా అందించిన మేఘా సంస్థ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భక్తులకు ఉచితంగా రవాణా వసతి కల్పించేందుకు పది నూతన విద్యుత్‌ ధర్మరథాలను తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థ తయారుచేసిన రూ.18 కోట్ల విలువ బస్సులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ తితిదేకు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ తిరుమలలో పూజలు నిర్వహించారు. జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. డీజిల్‌ వాహనాల స్థానంలో దశలవారీగా విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని తితిదే బోర్డు నిర్ణయించిందని ఈ సందర్భంగా ఛైర్మన్‌ వివరించారు. ఏప్రిల్‌ 15 నుంచి బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఒలెక్ట్రా సంస్థ సీఎండీ కేవీ ప్రదీప్‌, తితిదే అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌1 నుంచి నడక మార్గంలో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు

భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌1 నుంచి వారంపాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారి మెట్టుమార్గంలో ఐదు వేల దివ్యదర్శనం టోకెన్లను ప్రయోగాత్మకంగా జారీ చేయనున్నామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏప్రిల్‌ 15నుంచి జులై 15 వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సామాన్యులకు ప్రాధాన్యమిస్తూ వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 ఎస్‌ఈడీ దర్శన టికెట్లను తగ్గించనున్నాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని