శ్రీవారి సేవలో త్రిదండి చినజీయర్‌ స్వామి

తిరుమల శ్రీవారిని త్రిదండి చినజీయర్‌ స్వామి సోమవారం సాయంత్రం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు.

Updated : 28 Mar 2023 06:36 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని త్రిదండి చినజీయర్‌ స్వామి సోమవారం సాయంత్రం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. స్వామీజీకి తితిదే అధికారులు స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం చేయించారు. అంతకు ముందు మైహోమ్‌ జూపల్లి రామేశ్వరరావు నిర్మించిన తిరుమలలోని పద్మావతి ప్రియ నూతన అతిథి గృహాన్ని చినజీయర్‌స్వామి ప్రారంభించారు. అనంతరం గతంలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమాన్‌ రామానుజాచార్యుల మఠం భవనం స్థానంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, మైహోమ్‌ సంస్థ ప్రముఖులు, స్వామీజీలు పాల్గొన్నారు.


శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారామ్‌ సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని