అంగన్‌వాడీ చిన్నారుల ఆధార్‌ నంబర్‌ తీసుకోవాలి

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాల లబ్ధి అందించేందుకు చిన్నారుల ఆధార్‌ నంబర్‌ను సేకరించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్‌ను జారీ చేసింది.

Updated : 28 Mar 2023 05:59 IST

ప్రభుత్వం గెజిట్‌ విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాల లబ్ధి అందించేందుకు చిన్నారుల ఆధార్‌ నంబర్‌ను సేకరించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్‌ను జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాల లబ్ధి అందిస్తున్నారు. కొంతమంది చిన్నారులకు సంబంధించి తల్లి ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఈ పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ప్రతి చిన్నారికి సంబంధించిన ఆధార్‌ నంబర్‌ను సేకరించి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ యాప్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎవరికైనా నంబర్‌ లేకపోతే నమోదుకు ప్రోత్సహించాలన్నారు. ఆధార్‌ నంబర్‌ లేని కారణంగా పథక లబ్ధిని నిలిపేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని