ఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్‌ ఎస్సీ గురుకులాల్లో రూ.6.18 కోట్ల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.

Updated : 28 Mar 2023 06:14 IST

అతిథి అధ్యాపకుల వేతనాల పెంపునకు ఆమోదం
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్‌ ఎస్సీ గురుకులాల్లో రూ.6.18 కోట్ల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. గురుకులాల్లో నిరంతర విద్యుత్తు సరఫరాకు రూ.65.8 కోట్లతో సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తాడేపల్లిలోని గురుకులాల సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘గురుకులాల్లో పనిచేసే అతిథి అధ్యాపకులు, పీజీటీ, టీజీటీలు, స్టాఫ్‌నర్సు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, పీడీ, పీఈటీల వేతనాలను సగటున రూ.4,550 నుంచి రూ.8,050లకు పెంచే ప్రతిపాదనను బోర్డు సమావేశంలో ఆమోదించామన్నారు. గురుకుల విద్యార్థులు దురదృష్టవశాత్తు మరణిస్తే సొసైటీ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించామన్నారు. స్టాఫ్‌ నర్సులు, హాస్టల్‌ కేర్‌ టేకర్లు, లైబ్రేరియన్లను నియమించడానికి ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతి పొందేలా ప్రయత్నిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు