ముడిసరకు తెచ్చుకోండి.. స్టీలు తీసుకెళ్లండి
విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోగా, అనుకున్నట్టే ప్రైవేటీకరణకు కొత్తదారి ఎంచుకుంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కొత్తదారి
తాజా నిర్ణయంపై కార్మిక సంఘాల ఆందోళన
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోగా, అనుకున్నట్టే ప్రైవేటీకరణకు కొత్తదారి ఎంచుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) నుంచి ‘స్టీలు సరఫరా వ్యాపార ప్రతిపాదన’ను కొత్తగా తెరపైకి తెచ్చింది. ఆసక్తి ఉన్న కంపెనీలు బొగ్గు, ఐరన్ ఓర్ వంటి ముడిసరకు తెచ్చుకుంటే, ఉక్కు తీసుకువెళ్లొచ్చని.. ఇందులో భాగస్వాములయ్యే ఆసక్తి ఉన్నవారికి ఆహ్వానం పలుకుతూ సోమవారం ప్రకటన జారీ చేశారు. ఆసక్తి ఉన్న కంపెనీలు ఏప్రిల్ 15లోగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) తెలియజేస్తూ వివరాలు సమర్పించాలన్నారు. ఈ కంపెనీలు ఉక్కు ముడిపదార్థాల వ్యాపారంలో ఉండాలన్న నిబంధన పెట్టారు. అయితే టన్నుకు ఎంత ధర తీసుకుంటారో పేర్కొనలేదు. ‘ముడిసరకు తెచ్చుకోండి- స్టీలు తీసుకెళ్లండి’ అనే కొత్త నినాదంతో కేంద్రం అడుగులు వేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు సోమవారం దిల్లీలో స్టీల్ కన్సల్టేటివ్ సభ్యులు, స్థాయీ సంఘ సభ్యులను కలిసి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని మొరపెట్టుకున్న రోజే ఇలా ప్రకటన జారీ కావడం చర్చనీయాంశమయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్