AP 10th Exams: 33 ప్రశ్నలకు వంద మార్కులు
పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది.
పదో తరగతిలో ఈసారి ఆరు పేపర్లే
ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభం
ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది. ఒకేసారి కొండంత సిలబస్ చదివి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఏడు పేపర్ల విధానంలో పరీక్ష నిర్వహించగా, ప్రస్తుతం తొలిసారి ఆరు పేపర్లతో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 3నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నాపత్రం ఉంటుంది. గత విద్యాసంవత్సరం ఎక్కువ మంది పదో తరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడమూ ఒక కారణమైంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు కరోనా సమయంలో వారి కింది తరగతుల్లో అభ్యసనను నష్టపోయారు. ఈ అంతరాన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం ప్రారంభంనుంచి ఉపాధ్యాయులు ప్రయత్నించినప్పటికీ చాలామంది విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోలేకపోయారు. సీబీఎస్‌ఈ విధానంలో ఐదు పేపర్లు ఉన్నా.. ఆ విద్యార్థులకు 20 శాతం అంతర్గత మార్కులతోపాటు ప్రశ్నాపత్రంలోనే 20 మార్కులు బహుళైచ్ఛికం కావడం వెసులుబాటునిస్తుంది. రాష్ట్ర బోర్డుకు వచ్చేసరికి అంతర్గత మార్కుల విధానం లేదు. వంద మార్కులకు పూర్తిగా రాత పరీక్షే నిర్వహిస్తారు. ఒక మార్కు ప్రశ్నకు జవాబు రాయాల్సిందే.
సామాన్యశాస్త్రం ఒక్క పేపరే..
గతేడాది వరకు భౌతిక, రసాయన శాస్త్రాలకు ఒక పేపర్, జీవశాస్త్రానికి మరో పేపర్ ఉండేది. ప్రస్తుతం సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు కలిపి ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. జీవశాస్త్రాన్ని ప్రశ్నాపత్రంలోనే ప్రత్యేక సెక్షన్‌గా విభజిస్తారు. భౌతిక, రసాయనశాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలున్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్య సబ్జెక్టులో చిన్నచిన్న పాఠాలు 22 వరకున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన బ్లూప్రింట్ ప్రకారం జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయన శాస్త్రాలనుంచి 16 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్‌లో ఇచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నలు అయిదింటికి తప్ప ఎక్కడా ఛాయిస్ లేదు. సాంఘిక శాస్త్రంలోనూ భూగోళం, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాల్లో కలిపి 22 అధ్యాయాలున్నాయి. గతంలో 11 పేపర్ల విధానం ఉన్నప్పుడు ఒక రోజు పరీక్ష బాగా రాయకపోతే మరో రోజు ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉండేది.
* విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మొదట 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. అదనంగా సమాధాన పత్రాలు అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. సామాన్యశాస్త్రం పరీక్షకు మాత్రం భౌతిక, రసాయన శాస్త్రాల జవాబులు రాసేందుకు 12 పేజీల బుక్‌లెట్, జీవశాస్త్రానికి మరో 12 పేజీల బుక్‌లెట్ విడివిడిగా ఇస్తారు.
* గతేడాది ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ల్లో వచ్చినందున ఈసారి ఎవరూ పరీక్ష గదుల్లోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే నిబంధనను విధించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఒడిశాలో ఘటన
-
Crime News
Drugs: ‘డార్క్ వెబ్’లో డ్రగ్స్.. రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్ఎస్డీ బ్లాట్స్ పట్టివేత!
-
General News
Chandrababu: హనుమాయమ్మ మృతిపై జోక్యం చేసుకోండి: చంద్రబాబు
-
World News
Prince Harry: ఫోన్ హ్యాకింగ్ కేసు.. తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ
-
India News
Operation Bluestar: ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 39ఏళ్లు.. ఆ రోజున ఏం జరిగింది..?
-
General News
Weather: మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు!