దళిత యువకుడి మృతి కేసులో నిందితులకు బెయిల్‌ రాకుండా చూడాలి

జాతరలో దళిత యువకుడి మృతికి కారణమైన నిందితులకు బెయిల్‌ రాకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2023 04:10 IST

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌
మృతుడి తల్లిదండ్రులను పరామర్శిస్తున్న మంద కృష్ణ మాదిగ

తొండంగి, న్యూస్‌టుడే: జాతరలో దళిత యువకుడి మృతికి కారణమైన నిందితులకు బెయిల్‌ రాకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. మంగళవారం శృంగవృక్షం, తొండంగి గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీనివాస్‌కు ఇప్పటి వరకు బెయిలు రాలేదని, అలాంటిది జాతరలో దళిత యువకుడు రాము మృతికి కారణమైన నిందితులకు ఎలా బెయిలు వస్తుందని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు జైళ్లో ఉండగానే విచారణ చేసి, వారికి శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. తుని నియోజకవర్గంలో ఓ దళిత యువకుడి హత్య జరిగితే మంత్రి దాడిశెట్టి రాజా ఇప్పటి వరకు ఖండించలేదన్నారు. ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్‌, నియోజకవర్గ ఎమ్మార్పీఎస్‌, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని