జిల్లెళ్లమూడి అమ్మ.. శక్తి స్వరూపిణి

జిల్లెళ్లమూడి అమ్మ తన ఇంటిని అందరి ఇల్లుగా పేర్కొన్న విశ్వజనని అని, కాలాతీత మహాశక్తి స్వరూపిణి అని విశ్రాంత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

Published : 29 Mar 2023 04:10 IST

విశ్రాంత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రారంభమైన అమ్మ శతజయంతి ఉత్సవాలు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లెళ్లమూడి అమ్మ తన ఇంటిని అందరి ఇల్లుగా పేర్కొన్న విశ్వజనని అని, కాలాతీత మహాశక్తి స్వరూపిణి అని విశ్రాంత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడిలో అనసూయాదేవి(అమ్మ) శతజయంతి ఉత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎల్వీ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సుల వల్లే సాధారణ విద్యార్థిగా ఉన్న తాను సివిల్స్‌లో 17వ ర్యాంకు సాధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు జేసీగా సేవలందించానన్నారు. లేని వాటి కోసం ఆరాటపడకుండా ఉన్నంతలో తృప్తి పడటమే ముక్తికి మార్గమని అమ్మ ఇచ్చిన సందేశం ఆచరణీయమని తెలిపారు. కార్యక్రమంలో శత జయంతి సంచిక శారదా వైజయంతిని ఆవిష్కరించారు. కుర్తాళం సిద్ధేశ్వర పీఠం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీస్వామి, తిరుపతి శ్రీశక్తి పీఠం పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామి, కాకతీయ సిమెంట్్స, షుగర్స్‌ సీఈవో పి.అనూరాధ, కంచి కామకోటి పీఠం ప్రతినిధి రామకృష్ణ, విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ఛైర్మన్‌ కుమ్మమూరు నరసింహమూర్తి, వంశపారంపర్య ధర్మకర్త బ్రహ్మాండం రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు