గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్పు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను మార్పు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Updated : 29 Mar 2023 06:40 IST

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను మార్పు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వీటిని జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్వహిస్తామని తాజాగా వెల్లడించింది. యూపీఎస్సీ మూడో విడత మౌఖిక పరీక్షలు ఏప్రిల్‌ 24 నుంచి మే 18 వరకు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జూన్‌ 3న తెలుగు, 5న ఆంగ్లం, 6న పేపర్‌-1 జనరల్‌ ఎస్సే,  7న పేపర్‌-2 రాష్ట్ర, దేశ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, 8న పేపర్‌-3 రాజకీయం, రాజ్యాంగం, గవర్నెన్స్‌, లా,   నీతిశాస్త్రం, 9న పేపర్‌-4 రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, 10న పేపర్‌-5 సైన్సు, టెక్నాలజీ, పర్యావరణ అంశాల పరీక్షలు ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని