Toll Charges: ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల బాదుడు మొదలుకానుంది.

Updated : 29 Mar 2023 07:08 IST

ఈనాడు, అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్‌ రుసుములను సమీక్షిస్తారు. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్‌ ప్లాజాల్లో ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీవోటీ కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్న మరో అయిదు టోల్‌ప్లాజాల రుసుమును జులై లేదా ఆగస్టులో సవరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు