ఈ నెల 31 నాటికి 1200 రోజులకు అమరావతి ఉద్యమం

ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో స్థానిక రైతులు, మహిళలు, ప్రజలు చేస్తున్న ఉద్యమం ఈ నెల 31 నాటికి 1200 రోజులకు చేరుకోనుంది.

Updated : 29 Mar 2023 05:58 IST

ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు ఐకాస నిర్ణయం

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో స్థానిక రైతులు, మహిళలు, ప్రజలు చేస్తున్న ఉద్యమం ఈ నెల 31 నాటికి 1200 రోజులకు చేరుకోనుంది. ‘రాష్ట్ర అభివృద్ధి కోసం దగా పడిన రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు, అమరావతికి అండగా 13 వేల గ్రామాల నీరు-మట్టి, పంచభూతాలు’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. రాజధాని గ్రామం మందడం శిబిరంలో 31వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణం అవసరాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలియపరచాలన్నదే కార్యక్రమ ఉద్దేశమని ఐకాస తెలిపింది. రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమరావతికి అండగా నిలవాలని వివిధ పార్టీల నాయకులను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు చెప్పింది. ఎంపీ గల్లా జయదేవ్‌, తెదేపా నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పద్మశ్రీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులను ఆహ్వానించనున్నట్లు ఐకాస సభ్యులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని