పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా

పాపికొండల విహారయాత్రకు అధికారులు పచ్చజెండా ఊపారు. అకాల వర్షాల నేపథ్యంలో ఇటీవల యాత్రలను అధికారులు నిలిపివేశారు.

Updated : 29 Mar 2023 04:26 IST

దేవీపట్నం, న్యూస్‌టుడే: పాపికొండల విహారయాత్రకు అధికారులు పచ్చజెండా ఊపారు. అకాల వర్షాల నేపథ్యంలో ఇటీవల యాత్రలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కంట్రోల్‌ రూమ్‌ వద్ద తనిఖీల అనంతరం పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి రెండు బోట్లపై పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు